తెలంగాణ

telangana

ETV Bharat / business

చమురు ధరలపై సుంకం పెంచుకోవచ్చు! - భవిష్యత్తులో చమురు ధరలకు రూ. 8 వరకు ఎక్సైజ్​ సుంకం పెంచుకొనేలా ప్రస్తుత చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం

భవిష్యత్తులో చమురు ధరలకు రూ. 8 వరకు ఎక్సైజ్​ సుంకం పెంచుకొనేలా ప్రస్తుత చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం పెట్రోలుపై రూ.18/లీ, డీజిల్‌ఫై రూ.12/లీ వరకు ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకం పెంచుకొనే పరిమితి లభిస్తుంది.

చమురు ధరలపై సుంకం పెంచుకోవచ్చు..

By

Published : Mar 23, 2020, 7:44 PM IST

భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.8 వరకు ఎక్సైజ్‌ సుంకం పెంచుకొనేలా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత చట్టాన్ని సవరించింది. ఆర్థిక బిల్లు-2020కి సవరణలు కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం.. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో పెట్రోలుపై రూ.18/లీ, డీజిల్‌ఫై రూ.12/లీ వరకు ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకం పెంచుకొనే పరిమితి లభిస్తుంది. సభలో అసలు చర్చేమీ జరగకుండానే బిల్లుకు ఆమోదం లభించడం గమనార్హం.

పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు 3 రూపాయలు ఎక్సైజ్‌ సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 14న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి అదనంగా రూ.39వేల కోట్ల ఆదాయం లభించనుంది. పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.4 పరిమితితో పెరుగుదల చోటు చేసుకుంది. ఆర్థిక చట్టంలోని ఎనిమిదో షెడ్యూలు సవరణతో ఇప్పుడా పరిమితి రూ.18, రూ.12గా మారింది. ఈ అధికారంతో ప్రభుత్వం ఎప్పుడైనా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.8 వరకు పెంచుకోవచ్చు.

ఇదీ చూడండి :లాక్​డౌన్​ దిశగా సుప్రీం- ఇక అత్యవసర విచారణలు మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details