తెలంగాణ

telangana

ETV Bharat / business

'భారీగా తగ్గనున్న వాహనాల డీలర్ల లాభదాయకత' - డీలర్ల పరిస్థితి

వాహన విక్రయాలు వరుసగా రెండో ఏడాది కూడా క్షీణించాయి. దీంతో డీలర్ల లాభదాయకత ఈ ఏడాది మరింత తగ్గిపోతుందని క్రిసిల్​ వెల్లడించింది. మొత్తం 2051మంది డీలర్ల స్థితిపై రూపొందించిన నివేదికలో క్రిసిల్​ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే కరోనా ముప్పు నుంచి తప్పించుకోవడానికి సొంత వాహనాలవైపే చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేసింది క్రిసిల్​.

Cricil report on vehicle dealers situation amid corona
'భారీగా తగ్గనున్న వాహనాల డీలర్ల లాభదాయకత'

By

Published : Jul 9, 2020, 7:01 AM IST

వరుసగా రెండేళ్ల పాటు వాహన విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణిస్తున్నందున, అసలే తక్కువగా ఉండే డీలర్ల లాభదాయకత ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గిపోతుందని రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది. తమ వద్ద రేటింగ్‌ పొందిన 2051 మంది డీలర్ల స్థితిపై క్రిసిల్‌ నివేదిక రూపొందించింది. ఈ ప్రకారం..

2019-20లో వాహన అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదవ్వగా, కొవిడ్‌-19 వల్ల జూన్‌ త్రైమాసికంలో మరింత కుదేలవ్వనుంది. వ్యాపారాలు బాగా తక్కువగా జరుగుతుండటం, రాకపోకలపై ఆంక్షలు, విచక్షణకు అనుగుణంగా ఖర్చు పెట్టే శక్తిని ప్రజలు కోల్పోవడం వల్ల వాహన అమ్మకాలు క్షీణిస్తున్నాయని వివరించింది. ఫలితంగా కొత్తగా మరింతమంది వాహన డీలర్లను నియమించుకోవాలన్న కంపెనీల లక్ష్యాలకు అవరోధం ఏర్పడుతోందని పేర్కొంది.

  • సొంతగా షోరూంలను కలిగి ఉన్న డీలర్లు, విడిభాగాల అమ్మకం, బీమా వంటి అనుబంధ సేవలను కలిగిన వారు ఈ నష్టాలను తట్టుకునే వీలుంది. డీలర్ల మొత్తం ఆదాయంలో ఈ సేవలపై 10-12 శాతం ఆదాయం లభించడమే ఇందుకు కారణం.
  • ద్విచక్ర వాహన డీలర్ల కంటే వాణిజ్య వాహన డీలర్లపై ప్రతికూల ప్రభావాలు అధికంగా ఉంటాయి.
  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కల్పించిన మారటోరియం, ప్రోత్సాహకాలు ముందస్తుగా అందించడం, వడ్డీవ్యయాల్లో కొంత భరించడంలో వాహన తయారీ సంస్థల సహకారం వల్ల డీలర్లకు ద్రవ్యలభ్యత పెరుగుతుంది.
  • కొవిడ్‌-19 వ్యాప్తి నుంచి బయట పడేందుకు సొంత వాహనాల వైపు ఎక్కువమంది మొగ్గుచూపుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో అమ్మకాలు పెరుగుతాయనే అంచనాను క్రిసిల్‌ వ్యక్తం చేసింది.

పెట్రోల్‌, సీఎన్‌జీ కార్ల అమ్మకాలు పెరుగుతాయ్‌: ఇక్రా

పెట్రోల్‌, డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం అతి తక్కువగా ఉండటంతో, పెట్రోల్‌, సీఎన్‌జీతో నడిచే ప్రయాణికుల వాహనాలపై భవిష్యత్తులో వినియోగదారులు మొగ్గుచూపుతారని మరో రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది.

  • ప్రయాణికుల వాహనాల్లో డీజిల్‌ విభాగ వాటా 2012-13లో 58 శాతం, 2019-20లో 29 శాతం కాగా, 2021-22లో 15-18 శాతానికి పరిమితం కావచ్చు. ఇది కార్లలో 11 నుంచి 5-7 శాతానికి, వినియోగ వాహనాల్లో 65 నుంచి 40 శాతానికి దిగిరావచ్చు.
  • రూ.5 లక్షల లోపు వాహనాల కొనుగోలుదార్లు పూర్తిగా పెట్రోల్‌, సీఎన్‌జీకే మొగ్గుచూపొచ్చు.
  • నీ బీఎస్‌6 ప్రమాణాల వల్ల వాహనాల ధరలు కూడా రూ.50-70 వేల వరకు పెరగడమూ ఇందుకు దోహద పడనుంది.

ఇదీ చూడండి:-వాహన విక్రయాలకు కరోనా సెగ.. భారీగా తగ్గిన అమ్మకాలు

ABOUT THE AUTHOR

...view details