ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన పెరుగుతోంది. డిజిటల్ లావాదేవీలకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం కూడా ఎక్కువయ్యింది. అయితే, క్రెడిట్ కార్డుల్లో చాలా రకాలుంటాయి. సాధారణంగా మనం బ్యాంక్ లేదా థర్డ్ పార్టీ కంపెనీలు ఏ కార్డుని ఆఫర్ చేస్తే ఆ కార్డునే తీసుకుంటుంటాం. కానీ, అది సరైన పద్ధతి కాదు. మీ అవసరం, వినియోగించే తీరును బట్టి కార్డును తీసుకోవాలి. ముఖ్యంగా తక్కువ ఛార్జీలతో ఎక్కువ ప్రయోజనాలుండే వాటిని ఎంపిక చేసుకోవాలి. మరి కార్డును తీసుకునేటప్పుడు ఎయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో ఓ లుక్కేద్దాం!
డిస్కౌంట్లు, ప్రయోజనాలు, రివార్డులు...
కొన్ని కార్డులు రెస్టారెంట్లలో.. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో.. ఇలా ఒక్కోరకం కార్డు ఒక్కోచోట ప్రత్యేక రాయితీలు ఇస్తాయి. మరికొన్ని కార్డుల్లో రివార్డు పాయింట్లు విమాన ఛార్జీగా మారతాయి. కొన్నేళ్ల క్రితం సిటీ బ్యాంక్ ఆఫర్ చేసిన ఓ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను హోటల్ రూం బుకింగ్‌కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఇలాంటి ఫీచర్లు కార్డు వినియోగాన్ని పెంచుతాయి. అలాగే మనకూ సౌకర్యంగా ఉంటాయి. వ్యాపారంలో భాగంగా తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి రివార్డు పాయింట్లు హోటల్ రూం బుకింగ్ ఛార్జీగా మారితే ఎంతో ప్రయోజనం కదా! ఈ నేపథ్యంలో మీ అవసరాన్ని బట్టి మీ కార్డు రకం, అందులోని ఫీచర్లు ఉండాలి. మీరు పెద్దగా ప్రయాణం చేయరనుకోండి.. అలాంటప్పుడు మీ కార్డులోని రివార్డు పాయింట్లు విమాన ఛార్జీగా మాత్రమే మారితే ఏం ప్రయోజనం?
క్యాష్‌బ్యాక్ లేదా రివార్డు పాయింట్లు...
మనం కార్డు వినియోగిస్తున్నందుకు ఇచ్చే బోనస్సే రివార్డు పాయింట్లు. మనం ఖర్చు చేసేదాన్ని బట్టి రివార్డు పాయింట్లు ఉంటాయి. తరచూ షాపింగ్ చేయాల్సిన అవసరం ఉన్న వారికి ఈ రివార్డు పాయింట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే క్యాష్‌బ్యాక్ కూడా. మనం చేసే చెల్లింపులపై ఎంతో కొంత డబ్బు తిరిగి మన ఖాతాలోకి చేరుతుంది. కొన్ని కార్డులు పెట్రోల్ బంకుల్లో చేసే లావాదేవీపై క్యాష్‌బ్యాక్ ఇస్తుంటాయి. పెట్రో ధరలు మండిపోతున్న ఈ తరుణంలో ఇది ఎంత ప్రయోజనకరమో చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ బైక్ లేదా కారుపై ప్రయాణం చేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
అంతర్జాతీయ ప్రయోజనాలు...