credit card with multiple offers: క్రెడిట్ కార్డు ఉంటే చేతిలో నగదు ఉన్నట్లే. ఖర్చు చేసిన తర్వాత లభించే వ్యవధి, ఈఎంఐ సౌకర్యం, మంచి క్రెడిట్ స్కోరును పొందేందుకు వీలు ఇలా ఈ కార్డుతో వెసులుబాట్లు ఎన్నో ఉన్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా చేసిన ఖర్చుకు కొంత రాయితీలు, ప్రత్యేక ఆఫర్లూ లభిస్తుంటాయి. ఇటీవల కాలంలో పలు సంస్థలు కో బ్రాండెడ్ కార్డులను విడుదల చేస్తున్నాయి. వీటిపై ప్రత్యేక రాయితీలను అందిస్తున్నాయి. కొన్ని అప్పటికప్పుడే అందుతుండగా, మరికొన్ని దీర్ఘకాలంలో ఉపయోగపడతాయి. కో బ్రాండెడ్ ట్రావెల్ కార్డు తీసుకున్నప్పుడు విమానం టిక్కెట్లపై 5 శాతం వరకూ నగదు వెనక్కి సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఇది ప్రతిసారీ ఉంటుంది. మరికొన్ని క్రెడిట్ కార్డులు సందర్భానుసారంగా రాయితీలు, ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. మరి వీటి గురించి ఎలా తెలుసుకోవాలి..
ఇ-మెయిల్ చూస్తుండండి..
క్రెడిట్ కార్డు సంస్థలు తరచూ ఆఫర్‌ల గురించి కార్డుదారుడికి ఇ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేస్తాయి. కాబట్టి, మీ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు కార్డు సంస్థ దగ్గర అప్‌డేట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మెయిల్ వచ్చినా స్పామ్ ఫోల్డర్‌లోకి వెళ్లిపోతుంది. దీన్ని పట్టించుకోకపోతే ఆఫర్ల విషయం తెలియకపోవచ్చు. కాబట్టి, ఒకసారి ఆ మెయిల్‌ను ఇన్‌బాక్స్‌లోకి తీసుకెళ్లాలి. అప్పుడు మీకు క్రెడిట్ కార్డు నుంచి వచ్చే ప్రతి సమాచారమూ తెలుస్తుంది.
వెబ్‌సైటులో..
కార్డు ద్వారా అందుతున్న ప్రయోజనాలను సంస్థలు ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్లలో పెడుతుంటాయి. బ్యాంకు మొబైల్ యాప్‌లోనూ ఆ వివరాలు కనిపిస్తాయి. అప్పుడప్పుడూ ఈ సమాచారాన్ని చూస్తుండాలి. మీరు క్రెడిట్ కార్డు పరిమితి పెంచుకునేందుకు, వేరే రకం కార్డును తీసుకోవాలనుకున్నా.. దానికి సంబంధించిన సమాచారం వెబ్‌సైటులోనే అందుబాటులో ఉంటుంది.
వ్యాపారుల నుంచి..