ప్రస్తుతం దేశంలో ఇస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు 'భారత్ రకం' కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తున్నాయని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ' (ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ఈ వ్యాక్సిన్లు పొందినవారిలో ఎవరికైనా ఇన్‌ఫెక్షన్ సోకినా.. స్వల్ప అనారోగ్యమే తలెత్తవచ్చని పేర్కొన్నారు. ఒక అధ్యయనానికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలను ఉటంకిస్తూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
భారత్ రకం వైరస్‌పై కొవాగ్జిన్, కొవిషీల్డ్ భేష్
దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు 'భారత్ రకం' కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తున్నాయని ఐజీఐబీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. కొవిషీల్డ్‌పై హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) నిర్వహించిన మరో అధ్యయనంలోనూ ఇవే సానుకూల ఫలితాలు వచ్చాయి.
కొవాగ్జిన్, కొవిషీల్డ్
కొవిషీల్డ్‌పై హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) నిర్వహించిన మరో అధ్యయనంలోనూ ఇవే సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇవి ప్రాథమికమే అయినప్పటికీ చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్ర తెలిపారు. కరోనాలో కొత్తగా వచ్చిన బి.1.617 రకాన్ని 'జంట ఉత్పరివర్తనల' వైరస్ లేదా 'భారత్ రకం'గా పిలుస్తున్నారు.