తెలంగాణ

telangana

ETV Bharat / business

'గత వందేళ్లలో కరోనానే అతిపెద్ద సంక్షోభం' - కొవిడ్​పై శక్తికాంత దాస్ స్పందన

shakti kanta das
శక్తికాంత దాస్

By

Published : Jul 11, 2020, 11:06 AM IST

Updated : Jul 11, 2020, 11:37 AM IST

11:27 July 11

ఆర్థిక వ్యవస్థ సరైన స్థితిలోనే ఉంది..

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా తాము అనేక చర్యలు తీసుకున్నామని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సరైన స్థితిలోనే ఉందని వెల్లడించారు. 

వృద్ధి రేటు తమకు అత్యంత కీలక అంశం అని దాస్ వివరించారు. ఆర్థిక స్ధిరత్వాన్ని కాపాడేందుకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్‌ వ్యవస్ధలో కొత్తగా ఉత్పన్నం అవుతున్న సమస్యలను గుర్తించేందుకు నిఘా యంత్రాంగాన్ని పటిష్టం చేశామని దాస్‌ వెల్లడించారు

10:46 July 11

ఉపాధిపై కరోనా పడగ

కరోనా వల్ల దేశవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్​బీఐ బ్యాంకింగ్, ఎకనమిక్స్ కాన్​క్లేవ్​లో​ పాల్గొన్న దాస్​ ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను.. దేశం గత వందేళ్లలో ఎన్నడూ ఎదుర్కోలేదని తెలిపారు ఆర్​బీఐ గవర్నర్. ఉపాధి, ఇతర రంగాలపై కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థిరత్వానికి అనేక చర్యలు చేపట్టినట్లు శక్తికాంతదాస్ వెల్లడించారు.

Last Updated : Jul 11, 2020, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details