ప్రపంచమంతా మునుపటిలా సాధారణ జీవితం తిరిగి పొందాలంటే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనడమే మన ముందున్న ఏకైక మార్గమని చెప్పారు సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. వైరస్‌ను నిలువరించేందుకు పరిశోధకులు కొన్ని ఔషధాలనుు పరీక్షిస్తున్నప్పటికీ.. వ్యాక్సిన్ మాత్రమే కచ్చితమైన ప్రభావం చూపుతుందని తెలిపారు. కరోనాపై వ్యాక్సిన్ ఏ విధంగా పని చేస్తుందనే విషయంపై ప్రత్యేక వీడియో రూపొందించారు బిల్ గేట్స్. ఇదే వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 115 రకాల వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నట్లు వివరించారు గేట్స్. వీటిలో కనీసం 10 వ్యాక్సిన్లు మెరుగైన ఫలితాలు ఇవ్వొచ్చన్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్ అభివృద్ధికి తమవంతు సాయంగా నిధులు సమకూరుస్తున్నారు.