తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ప్యాకేజీలో కౌలు రైతుల ఊసేది? - ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​ వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఐఐఎమ్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ సుఖ్​పాల్ సింగ్ అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం... 'ఆత్మ నిర్భర్​ భారత్ అభియాన్' కింద రెండో విడత ప్రకటించిన ప్యాకేజీ కూడా వీరికి నిరాశనే మిగిల్చిందని అభిప్రాయపడ్డారు.

Tenant Farmers are left out yet again
మరోసారి కౌలురైతులకు శూన్యహస్తం?

By

Published : May 15, 2020, 2:59 PM IST

Updated : May 15, 2020, 3:13 PM IST

కేంద్ర ప్రభుత్వం 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కింద రెండో విడత ప్రటించిన ప్యాకేజీ ... కౌలురైతులకు తీవ్ర నిరాశ కలిగించిందని ఐఐఎమ్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ సుఖ్​పాల్ సింగ్ అన్నారు. చిన్న, సన్నకారు రైతులు, వలస కార్మికులు, పేదలకు ఉద్దీపనలు ప్రకటించిన కేంద్రం... కౌలురైతులకు మాత్రం రిక్తహస్తం చూపించిందని విమర్శించారు.

మరోసారి కౌలురైతులకు శూన్యహస్తం?

తీవ్రంగా నష్టయారు...

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​ కారణంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని.. పంట కోత తరువాత వారికి మార్కెటింగ్ కష్టాలు కూడా ఎదురుకానున్నాయని సుఖ్​పాల్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండో విడత ప్రకటించిన ప్యాకేజీ రైతులకు, కౌలురైతులకు ఏమాత్రం సరిపోదని... ప్రభుత్వం మరింత ఆర్థిక సహకారం అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

మిగిలిన వారి సంగతేంటి?

"సుఖ్​పాల్​ ప్రకారం, నాబార్డ్​ ద్వారా రైతులకు అందిస్తామన్న రూ.30,000 కోట్ల అదనపు రీఫైనాన్స్​ 3 కోట్ల మంది రైతులకు మాత్రమే సరిపోతుంది. అయితే దేశంలో 11 కోట్ల మంది రైతులు ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి" అని ప్రశ్నిస్తున్నారు సుఖ్​పాల్ .

"సంక్షోభకాలంలో మూలధన అవసరాలకు అదనపు ధనం అందుబాటులో ఉంచడం మంచి విషయమే. అయితే లబ్ధి పొందాల్సిన 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులను నిజంగా ఎలా గుర్తిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయలేదు."

- సుఖ్​పాల్​ సింగ్, ప్రొఫెసర్​, ఐఐఎమ్ ​- అహ్మదాబాద్

'కేసీసీ'ల ప్రభావం

ప్రస్తుతమున్న కిసాన్ క్రెడిట్​ కార్డుల్లో (కేసీసీ) 10 నుంచి 11 శాతం మాత్రమే చెల్లుబాటు అవుతాయని సుఖ్​పాల్ పేర్కొన్నారు. అంటే ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు... కొద్ది మంది రైతులకు మాత్రమే లభిస్తాయి. అంతే కాకుండా కేసీసీలు కేవలం భూమి కలిగి ఉన్న రైతులకు ఉద్దేశించినవి. అంటే వీటి వల్ల కౌలురైతులకు ఎలాంటి ఉపయోగం చేకూరదు. ఇలాంటి పరిస్థితుల్లో కౌలురైతులకు పూచీకత్తు లేని రుణాలు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని సుఖ్​పాల్ సూచిస్తున్నారు.

పంటకోత తరువాతే అసలు కష్టాలు..

పంట కోతకు వచ్చిన తరువాతే రైతులకు అసలు కష్టాలు మొదలవుతాయని సుఖ్​పాల్ అన్నారు. ముఖ్యంగా మార్కెటింగ్ సమస్యలు రైతులకు పెను సవాల్​గా నిలుస్తాయని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను గుర్తించడంలేదని ఆయన విమర్శించారు.

"సరైన మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు, పంట సేకరణ విధానాలు లేకపోవడం వల్ల సప్లై-డిమాండ్ గొలుసుకు పలు అంతరాలు ఏర్పడతాయి. ఫలితంగా రైతులు అధికంగా పంట పండించినా.. వృథా అయ్యి తీవ్రంగా నష్టపోతారు."

- సుఖ్​పాల్​ సింగ్, ప్రొఫెసర్​, ఐఐఎమ్​- అహ్మదాబాద్

రేషన్ కార్డు పోర్టబులిటీ

ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు పథకం ద్వారా రేషన్​ కార్డుల పోర్టబిలిటీ తీసుకురావడం స్వాగతించే పరిణామమని సుఖ్​పాల్ అన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్​ ఇప్పటి నుంచి 5 నెలలపాటు అందిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:రాయితీలు ఇవ్వకపోతే కట్టేదెలా? అమ్మేదెలా?

Last Updated : May 15, 2020, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details