కరోనా సంక్షోభంతో నెమ్మదించిన ప్రగతి రథాన్ని తిరిగి గాడిన పెట్టడమే లక్ష్యంగా కీలక సంస్కరణలకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి పెంపు, ఉపాధి కల్పనకు ఉపకరించేలా 8 ప్రధాన రంగాల్లో సంస్థాగత మార్పులకు ఉపక్రమించింది.
ప్యాకేజ్ 4.0: వృద్ధికి ఊతం, ఉపాధి కల్పనే లక్ష్యం - ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్
వృద్ధికి ఊతం, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంతో కరోనా ప్యాకేజ్ 4.0ను ఆవిష్కరించింది కేంద్రం. ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 4వ రోజున ఈ వివరాలు వెల్లడించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్.

వృద్ధికి ఊతం, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్యాకేజీ 4.0
బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తి, ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్, విమానయాన మెయింటెనెన్స్-రిపేర్-ఓవరాల్, విద్యుత్ పంపిణీ, రోదసి, అణు ఇంధన రంగాల్లో ఈ సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
Last Updated : May 17, 2020, 9:22 AM IST