పన్ను సంబంధిత పనులను పూర్తి చేయడానికి గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది ఆదాయపు పన్ను శాఖ. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేసినట్లు భారత రెవెన్యూ సర్వీసెస్ అఖిల భారత సంఘం తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మార్చి 31 వరకు పన్ను సంబంధిత పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
'పన్ను లెక్కల పూర్తికి మరింత గడువు కావాలి' - TAX RELATED WORKS IN INDIA
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పన్ను సంబంధించి లెక్కలు పూర్తి చేసేందుకు తుది గడువును పెంచాలని ప్రభుత్వాన్ని ఐటీ శాఖ కోరింది. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.
ఆదాయపు పన్ను శాఖ
ప్రభుత్వం జారీ చేసిన సామాజిక దూరం నిబంధనలను పాటించేలా ఐటీ అధికారులను వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతించాలని కోరింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 31 గడువును సవరించాలని ప్రభుత్వాన్ని కోరాయి.
ఐటీ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఇదే తరహా డిమాండ్ చేసింది. ఆస్తులకు సంబంధించి కేసులను పూర్తి చేసేందుకు మార్చి 31 గడువును పొడిగించాలని కోరింది.