కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఆంక్షలు పొడగించిన నేపథ్యంలో జీవిత బీమా పాలసీదారులకు మరోమారు ఉపశమనం కల్పించింది ఇన్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ). మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన జీవిత బీమా ప్రీమియం చెల్లింపు గడువును మే 31 వరకు పొడిగించింది.
గతంలో 2 సార్లు..
మార్చి, ఏప్రిల్ నెలలకు చెందిన ప్రీమియం చెల్లింపు గడువును 30 రోజుల పాటు పొడిగిస్తూ గతంలో మార్చి 23, ఏప్రిల్ 4న నిర్ణయం తీసుకుంది ఐఆర్డీఏఐ. లాక్డౌన్ ఆంక్షలను మే 17 వరకు పొడిగించిన క్రమంలో మరోమారు గడువు పెంచినట్లు తెలిపింది.