తెలంగాణ

telangana

ETV Bharat / business

'స్పుత్నిక్‌ వి' టీకాకు నేడు ఆమోదం! - స్పుత్నిక్‌ వి, డాక్టర్​ రెడ్డీస్​

రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్‌ వి' టీకా అత్యవసర వినియోగంపై కేంద్ర నిపుణుల కమిటీ నేడు భేటీ కానుంది. కమిటీ ఆమోదం తెలిపిన కొద్ది రోజుల్లోనే ఈ టీకాకు వినియోగానికి కేంద్రం నుంచి అనుమతులు లభించవచ్చని సమాచారం. అయితే ఈ టీకాలను భారత్​లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు డాక్టర్​ రెడ్డీస్​ లాబొరేటరీస్​.. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.

COVID-19: India to decide emergency use authorisation of Sputnik V vaccine today
'స్పుత్నిక్‌ వి' టీకా ఆమోదంపై నేడు భేటీ

By

Published : Mar 31, 2021, 1:15 PM IST

దేశంలో అతి త్వరలో మరో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్‌ వి' టీకా అత్యవసర వినియోగంపై కేంద్ర నిపుణుల కమిటీ నేడు భేటీ కానుంది. నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే కొద్ది రోజుల్లోనే ఈ టీకా వినియోగానికి కేంద్రం నుంచి అనుమతులు లభించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 'స్పుత్నిక్‌ వి' టీకాపై మనదేశంలో రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ఇటీవల డాక్టర్‌ రెడ్డీస్‌ నిర్వహించింది. ఆ పరీక్షల భద్రత, ఇమ్యునోజెనిసిటీ సమాచారాన్ని ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలికి అందజేసిన డాక్టర్‌ రెడ్డీస్‌‌.. టీకా ఉత్పత్తి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకుంది. ఈ డేటాను కేంద్ర నిపుణుల బృందం నేడు విశ్లేషించనుంది.

కాగా.. అనుమతులు వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేసింది. 'స్పుత్నిక్‌ వి'.. రెండు డోసుల టీకా. తొలి డోసు తీసుకున్న 21 రోజుల తర్వాత రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌కు 90శాతానికి పైగా సమర్థత ఉన్నట్లు ఆ మధ్య 'ద లాన్సెట్‌' కథనం పేర్కొంది. మరోవైపు భారత్‌లో 'స్పుత్నిక్‌ వి' టీకా తయారీ కోసం రష్యా ఆర్‌డీఐఎఫ్‌ మరో నాలుగు స్థానిక సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చూడండి:'స్పుత్నిక్‌ వి' టీకాకు అత్యవసర అనుమతి!

ABOUT THE AUTHOR

...view details