తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాతో ఉపాధి కోల్పోయిన 20 లక్షల మంది! - కరోనాతో తీవ్రంగా కుదేలైన రంగాలు

ప్రైవేట్ బస్సు, టూరిస్టు ట్యాక్సీ ఆపరేటర్లు కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయారు. లాక్​డౌన్​తో ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది ఉపాధికి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతోంది.

taxi sector huge hit by Corona
టూరిజం ట్యాక్సీ రంగంలో ఉపాది తిప్పలు

By

Published : Jun 22, 2020, 12:03 PM IST

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ప్రభావంతో ప్రైవేటు బస్సు, టూరిస్టు ట్యాక్సీ ఆపరేటర్లు బాగా దెబ్బతిన్నారని బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఓసీఐ) వెల్లడించింది. ఈ కారణంగా సుమారు 20 లక్షల మంది తమ ఉపాధి కోల్పోయారని, మరో 30 నుంచి 40 శాతం మందికి ఇదే పరిస్థితి ఎదురవ్వచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

ఆదుకోండి..

15 లక్షల బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, 11 లక్షల టూరిస్టు ట్యాక్సీలను నిర్వహిస్తున్న 20,000 మంది ఆపరేటర్లకు బీఓసీఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. సుమారు కోటి మంది నేరుగా ఉపాధి పొందుతున్న ఈ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కు కున్నందున, ప్రభుత్వం సాయం చేయాలని బీఓసీఐ కోరుతోంది. చాలా మంది తమ సేవల్ని నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నందున, వారికి పన్నుల మాఫీ, రుణాలపై వడ్డీ మాఫీ ద్వారా సాయం చేయాలని బీఓసీఐ అభ్యర్థిస్తోంది.

మారటోరియం తర్వాత ఏం చేయాలో...

'లాక్‌డౌన్‌ సమయంలో 95 శాతం వాహనాలు రోడ్లపైకి రాలేదు. కంపెనీలతో ఒప్పందాల్లో ఉన్న కొన్ని బస్సులు మాత్రమే నడిచాయి. కొన్ని బస్సులు వలస కార్మికుల్ని తరలించడానికి వినియోగింమ'ని బీఓసీఐ అధ్యక్షుడు ప్రసన్న పట్వర్ధన్‌ వెల్లడించారు. వ్యాపారం లేకపోయినా, తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి రావడం వల్ల, బీఓసీఐ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు వరకు ఈఎంఐలపై ఆర్‌బీఐ మారటోరియం విధించడం కొంత ఊరట కలిగిస్తోందని, సెప్టెంబరు నుంచి ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. మోటారు వాహన పన్నుల మాఫీ, డీజిల్‌పై రాయితీలు, ఇంటర్‌సిటీ రవాణాలో టోల్‌ పన్నుల రద్దు వంటి సాయం చేయాలని కోరారు.

లాక్‌డౌన్‌ సమయంలో 3 నెలలు వాహనాలు రోడ్లపైకి రాలేదు కాబట్టి, అంతమేర బీమా పాలసీని పొడిగించాలని బీఓసీఐ విన్నవించింది. బస్సులకు ఏడాదికి రూ.50,000-2,00,000 బీమా చెల్లించాలంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారిందని .. బ్యాంకులు మారటోరియం కాలానికి వాహన రుణాలపై వడ్డీ మాఫీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. తాము కోరుతున్న 'వన్‌ నేషన్‌, వన్‌ ట్యాక్స్‌, వన్‌ పర్మిట్‌' ప్రతిపాదనను ఆమోదించాలని డిమాండ్ చేసింది.

ఇదీ చూడండి:చైనా ఉత్పత్తులపై సదాలోచనే దిక్సూచి

ABOUT THE AUTHOR

...view details