బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కొత్త సంవత్సరాది రోజునే ఎదురుదెబ్బ తగిలింది. జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు వినియోగించుకోవడానికి ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక కోర్టు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వెల్లడించారు.
అయితే ఉత్తర్వులను కోర్టు జనవరి 18 వరకు నిలిపివేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలపై సంబంధిత పక్షాలు(మాల్యా) బొంబాయి హైకోర్టులో అపీలు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.