తెలంగాణ

telangana

ETV Bharat / business

పన్ను తగ్గింపుతో... వాహనరంగానికి కొత్త ఉత్సాహం​

అమ్మకాలు లేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వాహనరంగానికి చేయూతనిచ్చేలా కేంద్రం..కార్పొరేట్ పన్నును తగ్గించింది. ఇప్పుడున్న 30 శాతం నుంచి 22 శాతానికి సవరించింది. ఫలితంగా వాహన రంగానికి కొత్త ఊతమొచ్చింది.

పన్ను తగ్గింపుతో... వాహనరంగానికి కొత్త ఉత్సాహం​

By

Published : Sep 21, 2019, 7:04 AM IST

Updated : Oct 1, 2019, 10:05 AM IST

డిమాండ్​ లేక సతమతమవుతున్న వాహన రంగానికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ కార్పొరేట్​ పన్నుల్లో కోత విధిస్తూ కీలక ప్రకటన చేశారు. ఫలితంగా వాహన, తయారీ రంగాలకు ఊతం లభించింది.

వాహన రంగానికి ఊరట

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటన వాహనరంగానికి ఊరటనిచ్చింది. ఫలితంగా కార్లు, బైక్​లు సహా వాహనరంగ విక్రయాలు ఊపందుకున్నాయి.

ఐషర్​ మోటార్స్, మారుతీ సుజూకీ, హీరో మోటోకార్ప్, జామ్నా ఆటో, అశోక్​ లేలాండ్ షేర్లు లాభాల బాటపట్టాయి. మారుతీ సుజూకీ ధర రూ.5,938.30 నుంచి రూ.6,626కు చేరుకుంది. అంటే 11 శాతం పెరిగింది. గత ఏడేళ్లలో లేని లాభాలతో మారుతీ మార్కెట్ క్యాపిటలైజేషన్​ బీఎస్​ఈలో రూ.1.99 లక్షల కోట్లకు పెరిగింది.

ప్రభుత్వం అకస్మాత్తుగా ఉత్పత్తి రంగాలపై, పెట్టుబడుల ప్రాముఖ్యతపై దృష్టి పెట్టిందని, ఇది చాలా ముఖ్యమైన నిర్ణయమని మారుతీ సుజూకీ ఛైర్మన్ ఆర్​సీ భార్గవ పేర్కొన్నారు.

కార్పొరేట్​ పన్ను

ప్రస్తుతం కార్పొరేట్ పన్ను 30 శాతంగా ఉంది. సర్​ఛార్జ్​, సెస్​ అన్నీ కలిపి ఇది రూ.34.94 శాతం అవుతుంది. జీఎస్టీ కౌన్సిల్ తాజాగా దేశీయ కంపెనీల కార్పొరేట్​ పన్నును 22 శాతానికి తగ్గించింది. అంటే సర్​ఛార్జ్​, సెస్​ కలిపి 25.01 శాతం అవుతుంది.

షరతులు వర్తిస్తాయి.

కార్పొరేటు పన్ను తగ్గింపు విషయంలో ఓ షరతు వర్తిస్తుంది. 22 శాతం రేటుతో పన్ను కట్టిన ఆయా కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు లభించవు. ఇవి కావాలంటే పాత పన్ను విధానంలో కార్పొరేట్ పన్నులు చెల్లించాల్సిందే.

ఇదీ చూడండి: ఇంధన బంధమే లక్ష్యంగా... మోదీ హ్యూస్టన్ సభ

Last Updated : Oct 1, 2019, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details