తెలంగాణ

telangana

ETV Bharat / business

దిగ్గజ కంపెనీలపై కరోనా పిడుగు! - US companies tell Fed coronavirus has hit manufacturing

ప్రపంచ దిగ్గజ కంపెనీలపై కరోనా వైరస్‌ ప్రభావం చూపుతోంది. మార్కెట్లపై ఈ ప్రభావం ఏవిధంగా ఉందనే దానిపై కంపెనీలు ప్రతిక్షణం విశ్లేషిస్తున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండానే తమ నివాసాల నుంచే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాయి.

cororna effect on  business companies in the world including america
దిగ్గజ కంపెనీలపై కరోనా పిడుగు!

By

Published : Mar 9, 2020, 9:31 PM IST

అమెరికా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన న్యూయార్క్‌లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు కరోనా భయంతో వణికిపోతున్నాయి. వాణిజ్య కేంద్రమైన వాల్‌స్ట్రీట్‌పై కరోనా వైరస్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల భయంతో మదుపరులతో పాటు స్టాక్‌ మార్కెట్లలో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావం మార్కెట్లపై ఏవిధంగా ఉందనే దానిపై కంపెనీలు కూడా ప్రతిక్షణం విశ్లేషిస్తున్నాయి.

ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండానే తమ నివాసాల నుంచే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాయి. దీని కోసం దిగ్గజ కంపెనీలు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా తక్షణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని సెక్యూరిటీస్ ఇండస్ట్రీ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ (సిఫ్మా)పేర్కొంది.

బ్యాకప్‌ వ్యవస్థలు

తమ ఉద్యోగులు కరోనా వైరస్‌ బారినపడకుండా కార్యకలాపాలను ఎలా చేపట్టాలో కంపెనీలు గతకొన్ని రోజులుగా కసరత్తు చేపట్టాయి. వీటిలో భాగంగా ఉద్యోగులను తమ ఇంటి వద్ద నుంచే పనిచేయించడం, కొన్ని టీములుగా విభజించి వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న ఇతర నగరాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉద్యోగులను న్యూయార్క్ నుంచే కాకుండా న్యూజెర్సీ, వెస్ట్‌చెస్టర్‌ నగరాలకు తరలించి అక్కడ నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

వీటితో పాటు ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు వీలుగా వారివారి నివాససముదాయాల్లో ఇంటర్నెట్‌తో పాటు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసింది. పూర్తిస్థాయిలో కేంద్ర కార్యాలయానికి రాకుండా పని చేసే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టింది. దీనికి భాగస్వామ్య బ్యాంకులు కూడా సహకరించేలా థర్డ్‌పార్టీ కంపెనీలతో కూడా చర్చలు చేపట్టిందని సిఫ్మా వెల్లడించింది. కేవలం జేపీ మోర్గాన్‌ కాకుండా వాల్‌స్ట్రీట్‌లోని చాలా కంపెనీలు ఇదే తరహా ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొంది.

ప్రయాణాలపై ఆంక్షలు

కేవలం పని, కార్యాలయ విభజనే కాకుండా, ప్రయాణాలపై కూడా జేపీమోర్గాన్‌, సిటీ గ్రూప్‌ ఆంక్షలు విధించాయి. కరోనావైరస్‌ ప్రభావం ఉన్న ప్రాంతాలకు కచ్చితంగా ప్రయాణాలను రద్దు చేయడంతోపాటు కార్యాలయంలో నిర్వహించే మీటింగులను కూడా పరిమితం చేసుకున్నాయి. వైరస్‌ ప్రభావ ప్రాంతాలనుంచి వచ్చే వారు 14రోజుల పాటు కార్యాలయానికి రాకుండా ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. విదేశీ ప్రయాణం చేసివచ్చినవారు తప్పనిసరిగా తమ ప్రయాణ వివరాలను తెలుపాలని ఆదేశించాయి.

పరిశుభ్రతా చర్యలు

కరోనా వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ చేస్తున్న సూచనలను కచ్చితంగా పాటించాలని తమ ఉద్యోగులకు, సందర్శకులను ఆదేశిస్తున్నాయి.

ఇదీ చదవండి:ఆస్పత్రి నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడు

ABOUT THE AUTHOR

...view details