ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇంధన వినియోగంపై పడుతోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) వెల్లడించింది. వందకుపైగా దేశాలకు కరోనా వ్యాపించిన వేళ ఇంధన వినియోగం పదేళ్లలో తొలిసారిగా తగ్గబోతున్నట్లు ఐఈఏ నివేదికలో పేర్కొంది.
కరోనా విస్తరణ కారణంగా చాలా దేశాల్లో ప్రజల జీవనం స్తంభించిపోతోంది. 2009 తర్వాత తొలిసారిగా రోజుకు 90 వేల బ్యారెళ్ల మేర ఇంధన వినియోగం తగ్గుతుందని అంచనా వేసింది ఐఈఏ. 2019 ఫిబ్రవరితో పోలిస్తే 2020 ఫిబ్రవరిలో ఇంధన వినియోగం 42 లక్షల బ్యారెళ్ల మేర తగ్గినట్లు అంచనా వేసింది.