చైనాలో కరోనా తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం నెమ్మదిగా ఒక్కో పరిశ్రమకు విస్తరిస్తోంది. కరోనా కారణంగా మార్చి నుంచి ఎల్ఈడీ బల్బుల ధరలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వైరస్ కారణంగా చైనా నుంచి ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమల విభాగం ఎలక్ట్రానిక్ ల్యాంప్ అండ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఎల్కోమా) వెల్లడించింది.
కరోనా ప్రభావంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదని ఎల్కోమా ఉపాధ్యక్షుడు సుమిత్ తెలిపారు.