తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా దెబ్బకు చైనా రివర్స్ గేర్- జీడీపీ 6.8% క్షీణత - Coronavirus-hit Chinese economy shrinks 6.8 pct in Q1, worst since 1976

కరోనా దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. 1976 తర్వాత అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైరస్ కారణంగా తొలి త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర క్షీణించింది. ముందస్తు అంచనాలతో పోలిస్తే వృద్ధి మరింత పతనమైనట్లు ఆ దేశ గణాంక సంస్థ స్పష్టం చేసింది.

chinese economy
కరోనా దెబ్బకు చైనా ఆర్థికం కుదేలు

By

Published : Apr 17, 2020, 10:52 AM IST

కరోనా వైరస్ చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 1976 చైనీస్ సాంస్కృతిక విప్లవం తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైరస్ కట్టడికి తీసుకున్న చర్యల ఫలితంగా 2020 తొలి త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ 6.8 శాతం మేర క్షీణించింది.

కరోనా దెబ్బకు అంచనాలను మించి ఆర్థిక వృద్ధి పడిపోయినట్లు ఆ దేశ జాతీయ గణాంక సంస్థ(ఎన్​బీఎస్) పేర్కొంది. పలు విశ్లేషకుల సర్వేలు మైనస్ 6 శాతం వృద్ధి అంచనా వేసినట్లు తెలిపింది. ప్రస్తుతం చైనా జీడీపీ ప్రస్తుతం 2.91 ట్రిలియన్ డాలర్లుగా ఉందని ఎన్​బీఎస్ స్పష్టం చేసింది. తొలి రెండు నెలల్లో 20.5 శాతం తగ్గిన వృద్ధి... అనంతరం తిరిగి పుంజుకున్నట్లు తెలిపింది.

క్యాటరింగ్​లో 44 శాతం క్షీణత

వినియోగదారుల వస్తువుల రిటైల్ అమ్మకాల్లో వృద్ధి 19 శాతం క్షీణించింది. క్యాటరింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే క్యాటరింగ్ రంగ వృద్ధి 44.3 శాతం పతనమైంది.

తాజా గణాంకాల ప్రకారం చైనా జీడీపీలో 60 శాతం వాటా ఉన్న సేవారంగం వృద్ధి 5.2 శాతం పతనమైంది. ప్రాథమిక రంగం 3.2 శాతం, పారిశ్రామిక రంగం 9.6 శాతం మేర క్షీణించింది.

అయితే క్యూ1లో దేశ ఆర్థిక సామాజిక వృద్ధి స్థిరంగానే ఉందని ఎన్​బీఎస్ అభిప్రాయపడింది. మార్చిలో నిరుద్యోగం స్వల్పంగా తగ్గినట్లు వెల్లడించింది. అంతకుముందు నెలతో పోలిస్తే 0.3 శాతం క్షీణించినట్లు స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details