కరోనా చికిత్సకు వర్తించేలా ఇటీవలే అందుబాటులోకి వచ్చిన కరోనా కవచ్ పాలసీకి మరిన్ని కీలక అనుమతులు ఇచ్చింది భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ). కరోనా కవచ్‌ను గ్రూప్ ఆరోగ్య పాలసీగా విక్రయించేందుకు సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు అనుమతులిచ్చింది.
ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తూనే.. పాలసీ ముందు 'గ్రూప్' అని చేర్చాలని సూచించింది. వ్యక్తిగతంగా అందించే పాలసీకి వర్తించే నిబంధనలే గ్రూప్ పాలసీకీ వర్తిస్తాయని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. గ్రూప్ పాలసీకి ప్రీమియం నిర్ణయించే అధికారం బీమా సంస్థలదేనని తెలిపింది.