కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా 2020 ఏప్రిల్‌లో 8కీలక మౌలిక రంగాల ఉత్పత్తి భారీగా పడిపోయింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, చమురు శుద్ధి, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ ఉత్పత్తిలో 38.1శాతం క్షీణత నమోదైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది.
ఏప్రిల్‌లో భారీగా పడిపోయిన మౌలిక రంగాల ఉత్పత్తి - Core sector output
కరోనా ప్రభావం మౌలిక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. లాక్‌డౌన్ వల్ల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పడిపోయింది. ఒక్క ఏప్రిల్లోనే మౌలిక రంగాల ఉత్పత్తిలో 38.1శాతం క్షీణత నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
![ఏప్రిల్‌లో భారీగా పడిపోయిన మౌలిక రంగాల ఉత్పత్తి core-sector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7398887-187-7398887-1590764140120.jpg)
మౌలిక రంగాల ఉత్పత్తి
ఈ ఏడాది మార్చి నెలలో ఆయా రంగాల్లో 9శాతం క్షీణత నమోదు కాగా, ఏప్రిల్‌లో అది మరింత దిగజారింది. 2019 ఏప్రిల్‌లో ఈ రంగాల్లో 5.2 శాతం వృద్ధి నమోదైతే ఈసారి 38శాతం క్షీణత నమోదు కావడం దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది.