తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏసీ, టీవీ, ఫ్రిజ్​ ధరలకు రెక్కలు.. ఎంత పెరుగుతాయంటే... - పెరగనున్న టీవీల ధరలు

Consumer Durables Price Hike: కొత్త ఏడాదిలో వినియోగదారులకు ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల సంస్థలు షాక్​ ఇవ్వనున్నాయి. గృహోపకరణాల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్​ల ధరలు మరింత పెరగనున్నట్లు సంబంధిత సంస్థలు పేర్కొన్నాయి. ముడిసరకు ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం అని వివరించాయి.

Consumer Durables Price Hike
పెరగనున్న గృహోపకరణాల ధరలు

By

Published : Jan 9, 2022, 3:39 PM IST

Consumer Durables Price Hike: కొత్త ఏడాదిలో గృహోపకరణాలు అయిన ఎయిర్​ కండీషనర్స్​, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్​ వస్తువుల ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరకుతో పాటు రవాణా ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్​ వర్గాలు తెలిపాయి. పెంచిన ధరలు ఈ నెల చివరకు కానీ.. లేక మార్చి నాటికి అమలులోకి రానున్నాయి.

పానసోనిక్​, ఎల్​జీ, హయర్​ లాంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచే ఆలోచనలో ఉండగా.. సోనీ, హిటాచీ, గోద్రెజ్​ అప్లయన్సెస్​ లాంటి సంస్థలు కూడా ఈ త్రైమాసికం చివరకు నిర్ణయం తీసుకోనున్నాయి.

జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో సుమారు 5 నుంచి 7 శాతం వరకు వస్తువులపై ధరలు పెరగనున్నట్లు కన్జ్యూమర్​ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీమా) తెలిపింది. "ఉత్పత్తులు, అంతర్జాతీయ రవాణా ఛార్జీలు, ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ ధరలను 3 నుంచి 5 శాతం వరకు పెంచాలని నిర్ణయించాం" అని హయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ తెలిపారు.

పానసోనిక్​ ఇప్పటికే ఏసీల ధరలను 8 శాతం వరకు పెంచింది. మిగిలిన వాటి ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా డివిజనల్ డైరెక్టర్​ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. ముడిసరకుల, లాజిస్టిక్స్​ ఖర్చులు ఎగబాకిన దృష్ట్యా గృహోపకరణాల ధరలను పెంచినట్లు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్​ ఉత్పత్తులు తయారీ సంస్థ ఎల్​జీ తెలిపింది.

ఇవీ చూడండి:

Reliance buys Mandarin Oriental: రిలయన్స్‌ చేతికి న్యూయార్క్‌ హోటల్‌

Reliance Jio IPO: ఈ ఏడాదిలోనే రిలయన్స్ జియో ఐపీఓ!

ABOUT THE AUTHOR

...view details