తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​పోర్ట్​లో మాస్క్​ 'సరిగ్గా' ధరించకపోతే అంతే! - మాస్కులు 'సరిగ్గా' ధరించనివారిపై చర్యలు

విమానాశ్రయాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనలపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తంచేసింది. మార్గదర్శకాలు సరిగ్గా పాటించనివారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Consider imposing fines on passengers not wearing masks 'properly': DGCA to airports
విమానాశ్రయాల్లో మాస్కులు 'సరిగ్గా' ధరించనివారిపై చర్యలు

By

Published : Mar 30, 2021, 2:44 PM IST

విమానాశ్రయాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనలపై డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు సరిగా పాటించట్లేదని పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ ఆక్షేపించారు.

మాస్కులు, సామాజిక దూరం పాటించని వారిపై విమానాశ్రయాలు చర్యలు తీసుకోవట్లేదని డీజీసీఏ విమర్శించింది. నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని పేర్కొంది.

మరోసారి మార్గదర్శకాలు

విమానాశ్రయాలకు మరోసారి మార్గదర్శకాలు జారీచేశారు పౌర విమానయాన డీజీ. వాటిని అమలు చేయడంలో అలసత్వం చూపొద్దని ఆదేశించారు. ఉల్లంఘించినట్లు తెలిస్తే ఎలాంటి చర్యలకైనా వెనుకాడేది లేదని డీజీసీఏ హెచ్చరించారు.

ఇదీ చూడండి:'చెంపదెబ్బ'పై బాబుల్ వివరణ- టీఎంసీ విమర్శ

ABOUT THE AUTHOR

...view details