కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక ఆదాయ వ్యయ పద్దుపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ. నిస్సారమైన బడ్జెట్‌గా పేర్కొంది. మందగమనం పరిస్థితుల్లోనూ ఉద్దీపన చర్యలేవీ ప్రకటించలేదని విమర్శించింది. అరకొర చర్యలు, ఉన్న పథకాలనే తిరిగి ప్రకటన, పన్ను స్లాబ్‌ల గారడీకి పరిమితమే... ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి పరిష్కారాలు చూపలేదని దుయ్యబట్టింది.
పద్దుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
"ప్రస్తుత ప్రధాన సమస్య నిరుద్యోగం. యువత ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి కచ్చితమైన, వ్యూహాత్మక ప్రణాళిక కనిపించలేదు. పాత విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పారు. ఇదే ప్రభుత్వ మనస్తత్వం. అన్ని మాట్లాడినప్పటికీ ఏమీ జరగదు. చరిత్ర చూసుకుంటే బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైనది అనుకుంటా. కానీ అందులో ఏమీ లేదు. అంతా డొల్ల."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.