తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవిడ్​ టీకా ధరలపై షా అసంతృప్తి! - కొవిడ్ వ్యాక్సిన్ ధరపై కిరణ్​ మజుందార్​ షా స్పందన

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టీకా డోసుకు గరిష్ట ధర రూ.250కి మించొద్దని కేంద్రం నిర్ణయించడాన్నిబయోకాన్‌ ఛైరపర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తప్పుబట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డోసుకు 3 డాలర్లను ధరగా పెట్టినప్పుడు.. దేశంలో రెండు డాలర్లకు తగ్గించడమేంటని ప్రశ్నించారు.

Kiran Mazumdar Shaw on Covid vaccine price
టీకా ధరపై అసంతృప్తి

By

Published : Feb 28, 2021, 3:17 PM IST

ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ టీకా ధరను రూ.250గా నిర్ణయించడంపై బయోకాన్‌ ఛైరపర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో వ్యాక్సిన్‌ సంస్థలు మోసపోయినట్లుగా అభిప్రాయపడ్డారు. టీకా రంగానికి ప్రోత్సాహకాలకు బదులు.. అణిచివేస్తున్నారని ఆరోపించారు.

ఇంత తక్కువ ధరకు టీకా ఇవ్వడం కష్టమని షా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డోసుకు 3 డాలర్లను ధరగా పెట్టినప్పుడు.. దేశంలో రెండు డాలర్లకే అందించడమేంటని కిరణ్‌ మజుందార్‌ ప్రశ్నించారు.

కిరణ్‌ మజుందార్‌ షా ట్వీట్​

కరోనా టీకా ధరను రూ.150గా నిర్ణయిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయించింది. సర్వీస్‌ ఛార్జీ రూ.100తో కలిపి టీకా డోసు ధర రూ.250 మించొద్దని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే టీకా ఉచితమని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరను మాత్రం ప్రజలే చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:పసిడి బాండ్ల ఇష్యూ సోమవారమే షురూ

ABOUT THE AUTHOR

...view details