భారత్‌లో ఫైజర్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల ప్రభుత్వాలతో చర్చలు ప్రారంభించినట్లు తెలిపింది.
భారత్‌లోనూ టీకాను ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించేందుకు ఫైజర్ కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా మాత్రమే టీకాను సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల ప్రభుత్వాలతో ప్రస్తుతం మేం చర్చలు జరుపుతున్నాం. భారత ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు, దేశంలో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అవకాశాల అన్వేషణకు కట్టుబడి ఉన్నాం."