తెలంగాణ

telangana

ETV Bharat / business

'మే 17 వరకు విమాన సేవలు పునరుద్ధరించరాదు'

లాక్​డౌన్​ 3.0 ముగిసే వరకూ విమాన సేవలు పునరుద్ధరించరాదని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి దేశీయ అంతర్జాతీయ ప్రయాణాలు చేపట్టరాదని సదరు సంస్థలకు మరోసారి పునరుద్ఘాటించింది.

flights to remain suspended
మే 17 వరకు విమాన సేవలు బంద్

By

Published : May 2, 2020, 11:51 PM IST

దేశవ్యాప్తంగా విమాన సేవలను లాక్​డౌన్​ ముగిసే మే 17వ తేది అర్ధరాత్రి వరకూ పునరుద్దరించరాదని సదురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది పౌర విమాన యాన శాఖ. విదేశీ, దేశీయ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించడం గురించి ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలని స్పష్టం చేసింది.

కరోనా వైరస్​ నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 25నుంచి విమాన సేవలపై ఆంక్షలు విధించింది కేంద్రం. కార్గో, వైద్య పరికరలా సరఫరా, పలు ప్రత్యేక విమాన సేవలకు మాత్రమే అనుమతిచ్చింది. మే 17 వరకు అన్ని ప్యాసింజర్ విమానాల నిషేధాన్ని ఇప్పుడు మరోసారి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 4తో ముగుస్తున్న లాక్​డౌన్​ను మరో రెండు వారాలు పొడిగిస్తూ శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను సడలించింది.

ABOUT THE AUTHOR

...view details