LPG Cylinder Price: నూతన సంవత్సర వేళ ఇంధన తయారీ సంస్థలు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. వాణిజ్య సిలిండర్ ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 102.50 తగ్గిస్తున్నట్లు తెలిపాయి. ఈ తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు చమురు సంస్థల వర్గాలు వెల్లడించాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
డిసెంబరు 1న వాణిజ్య సిలిండర్ ధరను రూ.100కు పైగా పెంచడంతో దేశ రాజధారి దిల్లీలో ఈ సిలిండర్ ధర ఏకంగా రూ.2,101కు పెరిగింది. 2012-13 తర్వాత కమర్షియల్ సిలిండర్ రూ.2,200లకు చేరడం మళ్లీ ఇప్పుడే. దీంతో రెస్టారంట్లు, హోటళ్లు, టీ స్టాల్ వ్యాపారులపై అదనపు భారం పడింది. ఇప్పుడు ఆ సిలిండర్ల ధరను తగ్గించడంతో వారికి కొంతమేర ఊరట లభించినట్లయింది. తాజా తగ్గింపుతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1998.50గా ఉంది. అయితే గృహ అవసరాలను వినియోగించే 14.2కేజీలు, 5కేజీలు, 10కేజీల కాంపోజిట్, 5 కేజీల కాంపోజిట్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.