వ్యాపారులు జీఎస్‌టీ వివరాలు సమర్పించే జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్ (GST return) దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపేసినా.. ఆ తదుపరి నెలకు జీఎస్‌టీఆర్-1 విక్రయాల రిటర్న్‌ను దాఖలు చేసే వీలుండదు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం జీఎస్‌టీఆర్-3బీని రెండు నెలల పాటు దాఖలు చేయకుంటే జీఎస్‌టీఆర్-1ను సమర్పించడానికి వీల్లేదు. వచ్చే ఏడాది నుంచి దీనిని ఒక నెలకు తగ్గించనుంది. ఇందుకు గాను కేంద్ర జీఎస్‌టీ నిబంధనల్లోని 59(6)వ నిబంధనలో సవరణ చేయనుంది.
జీఎస్‌టీఆర్-3బీని ఒక్క నెల ఆపేసినా జీఎస్‌టీఆర్-1 దాఖలుకు వీలుండదు - gstr 3b
జీఎస్‌టీఆర్-3బీని (GST return) ఒక్క నెల ఆపేసినా జీఎస్‌టీఆర్-1 దాఖలుకు ఇకపై వీలుండదు. 2022 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకిరానుంది.
జీఎస్‌టీ
ఒక నెలలో చేసిన విక్రయాల వివరాలతో జీఎస్‌టీఆర్-1ను మరుసటి నెల 11వ తేదీ కల్లా వ్యాపారులు దాఖలు చేస్తుంటారు. జీఎస్‌టీ వివరాలతో (సమరీ) జీఎస్‌టీఆర్-3బీని మరుసటి నెల 20-24 రోజుల మధ్య సమర్పించి.. జీఎస్‌టీని చెల్లిస్తుంటారు. ఆధార్ ధ్రువీకరణ ద్వారా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ఇదీ చూడండి:GST Petrol news: 'జీఎస్‌టీలోకి పెట్రో ఇప్పుడే కాదు'