ప్రముఖ కోల్డ్ చైన్ ఉత్పత్తుల సంస్థ రాక్వెల్.. వ్యాక్సిన్లను భద్రపరిచే ఫ్రీజర్లను అందించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. తాజా ఒప్పందంతో టీకాల తరలింపు, భద్రపరచటంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని రెడ్డీస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో స్పుత్నిక్-వి టీకాను ప్రజలకు అందించేందుకు మార్గం మరింత సుగమవుతుందన్నారు.
స్పుత్నిక్-వి టీకాలను మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. అప్పుడే టీకాలు సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉంటాయి. దీంతో స్పుత్నిక్ టీకాలను గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేయడం సవాలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే స్పుత్నిక్ టీకాలను సురక్షిత ఉష్ణోగ్రతల వద్ద భద్రపరిచేందుకు వీలుగా వ్యాక్సిన్ ఫ్రీజర్లను అందించేందుకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం చేసుకుంది హైదరాబాద్‌కు చెందిన రాక్వెల్ సంస్థ.