కేఫ్ కాఫీ డే ఛైర్మన్ అండ్ మేనేజింగ డైరెక్టర్ వీజీ సిద్ధార్థ ఆకస్మిక మరణంతో ఆ కంపెనీ షేర్లు కుదేలవుతున్నాయి. ఇవాళ సంస్థ షేర్లు మరో 10 శాతం మేర పతనమయ్యాయి. దీంతో సంస్థ షేర్ విలువ 52 వారాల కనిష్ఠస్థాయికి అంటే రూ.110.95కు చేరుకుంది.
గత మూడు రోజుల్లో... బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్లో సీసీడీ షేర్ విలువ 42 శాతం (బీఎస్ఈలో) పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.1,723 కోట్లు తగ్గి... రూ.2,343.84 కోట్లకు చేరింది.