తెలంగాణ

telangana

ETV Bharat / business

17శాతం మంది ఉద్యోగులకు కోకాకోలా ఉద్వాసన - అమెరికా కోకాకోలా ఉద్యోగుల తొలగింపు

కంపెనీ అభివృద్ధి, బ్రాండ్ల తొలగింపు దృష్ట్యా కోకాకోలా కంపెనీ 2 వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలోనే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోతారని తెలిపింది.

Coca-Cola laying off 2,200 workers as it pares brands
2 వేల ఉద్యోగులను తొలగించనున్న కోకాకోలా

By

Published : Dec 18, 2020, 10:19 AM IST

ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలోని 17 శాతం(2,200 మంది) ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు దిగ్గజ కోకాకోలా కంపెనీ వెల్లడించింది. వ్యాపార పునర్​వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

అమెరికాలోని కోకాకోలా కంపెనీపై దీని ప్రభావం అధికంగా పడనుంది. దాదాపు 10,400మంది ఉద్యోగులున్న​ కంపెనీ నుంచే.. ఎక్కువ మందిని తొలగించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ సంస్థ... గతేడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా 86,200 ఉద్యోగులను నియమించుకుంది.

కరోనా కారణంగా సినిమా హాళ్లు, క్రీడా మైదానాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కోక్​ సంస్థకు మొత్తం ఆదాయంలో 9శాతం నష్టం వాటిల్లింది. ఫలితంగా జులై-సెప్టెంబర్​లో ఆ కంపెనీ ఆదాయం 8.7 బిలియన్​ డాలర్లకు పడిపోయింది. ఈ నష్టం నుంచి గట్టెక్కేందుకు కోక్​ సంస్థ తమ బ్రాండ్లను సగానికి తగ్గిస్తోంది. ఈ సంవత్సరం టాబ్, జికో కొబ్బరి నీరు, డైట్ కోక్ ఫియెస్టీ చెర్రీ మొదలైన బ్రాండ్లను తొలగిస్తోంది.

ఇదీ చదవండి:''హ్యాక్'​తో తీవ్ర ముప్పు.. తస్మాత్​ జాగ్రత్త'

ABOUT THE AUTHOR

...view details