అంతర్జాతీయంగా సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో రంగాల దూకుడుతో సూచీలు జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. లోహ, బ్యాంకింగ్ రంగం షేర్లు నష్టపోయాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఇవాళ్టి ట్రేడింగ్‌లో 48 వేల 854 వద్ద జీవిత కాల గరిష్ఠాన్ని తాకింది. ఒక దశలో 760 పాయింట్లకుపైగా పెరిగింది. చివరకు 689 పాయింట్ల లాభంతో 48 వేల 783 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 14 వేల 347 వద్ద సెషన్‌ను ముగించింది.