భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత విభాగానికి నూతన ఛైర్మన్‌గా సీకే రంగనాథన్, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా సుచిత్ర ఎల్ల ఎన్నికయ్యారు. వీరిరువురూ 2021-22 సంవత్సరానికి ఈ పదవులు నిర్వహిస్తారు. సీకే రంగనాథన్ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కెవిన్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీగా ఉన్నారు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా సీఐఐలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. సుచిత్ర ఎల్ల హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సహ-వ్యవస్థాపకురాలు. ప్రస్తుతం ఆ సంస్థకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. గతంలో ఆమె సీఐఐ- ఆంధ్రప్రదేశ్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.
కరోనానూ అవకాశంగా తీసుకున్నాం...
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద లక్ష మందికి ప్రత్యక్ష సాయం, పచ్చదనం పెంపు, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం తగ్గింపు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగం పేర్కొంది. లాక్‌డౌన్ సమయంలో అనేక పునరావాస కార్యక్రమాలతోపాటు, ప్రభుత్వంతో కలిసి పలు పనులు చేపట్టినట్లు ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది.