తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒడుదొడుకులు ఉన్నా శ్రమిస్తే విజయమే: శైలజాకిరణ్​

హైదరాబాద్​లో సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో ఎండీ శైలజా కిరణ్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ 2.0 ద గ్రోత్ స్టోరీ కంటిన్యూస్ పేరుతో నిర్వహించిన సమావేశంలో పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించారు.

తాజ్​ డెక్కన్​లో సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశం

By

Published : Mar 20, 2019, 10:38 PM IST

Updated : Mar 21, 2019, 7:47 AM IST

సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశం
బంగారు తెలంగాణ మహిళా సాధికారతతోనే సాధ్యమవుతుందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లో జరిగిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో శైలజా కిరణ్​ పాల్గొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, సీఐఐ సౌత్ రీజియన్ ఛైర్మన్ దినేశ్‌ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

తెలంగాణ 2.0 ద గ్రోత్ స్టోరీ కంటిన్యూస్ పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు... పెట్టుబడులను ఆకర్షించటంపై చర్చించారు. వ్యాపారం అనేది విత్తు నాటి మొక్కను పెంచి చెట్టుగా ఎదిగేలా చేయడమన్నారు శైలజా కిరణ్. ఎన్నో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ...శ్రమిస్తే తప్పక సఫలమవుతామని పేర్కొన్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని...పట్టుదలతో విజయతీరాలకు చేరాలని పిలుపునిచ్చారు.

Last Updated : Mar 21, 2019, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details