తెలంగాణ

telangana

ETV Bharat / business

Chip Shortage: వాహన విక్రయాలకు చిప్‌సెట్‌ చెక్‌ - మారుతీ సుజుకీ

సెమీ కండక్టర్ల కొరత (Chip Shortage ) వాహన రంగాన్ని వేధిస్తోంది. ఈ ప్రభావంతో దిగ్గజ సంస్థలు సెప్టెంబరులో తమ ఉత్పత్తి తగ్గించాయి. (Chip Shortage auto sales) పండుగ సీజన్​లో వాహనాలకు డిమాండ్ అధికంగానే ఉన్నప్పటికీ.. విడిభాగాల సరఫరా ఇబ్బందికరంగా మారింది.

chip shortage
వాహన విక్రయాలకు చిప్‌సెట్‌ చెక్‌

By

Published : Oct 2, 2021, 7:03 AM IST

వాహన టోకు విక్రయాలు సెప్టెంబరులో నిరాశపరిచాయి. (Chip Shortage Auto Sales) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీ కండక్టర్ల (చిప్‌సెట్‌) కొరతతో (Chip Shortage) ఎలక్ట్రానిక్‌ పరికరాల సరఫరాపై ప్రభావం పడటంతో దేశీయ దిగ్గజ వాహన సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా (Chip Shortage in auto industry) తమ ఉత్పత్తిలో కోత విధించాయి. విక్రయాలు తగ్గినట్లు కియా ఇండియా, హోండా కార్స్‌ కూడా ప్రకటించాయి. టాటా మోటార్స్‌, (Tata Motors Chip Shortage) టయోటా కిర్లోస్కర్‌, ఎంజీ మోటార్‌, స్కోడా, నిస్సాన్‌ సంస్థలు మాత్రం సరఫరాలు పెరిగినట్లు వెల్లడించాయి. పండుగ సమయంలో గిరాకీ అధికంగానే ఉన్నా, ఎలక్ట్రానిక్‌ విడిభాగాల సరఫరా (Chip Shortage 2021) సవాళ్లు ఇబ్బంది పెడుతున్నాయని టాటామోటార్స్‌ పేర్కొంది.

మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki cars) మొత్తం విక్రయాలు సెప్టెంబరులో 46 శాతం క్షీణించాయి. 2020 సెప్టెంబరులో సంస్థ 1,60,442 వాహనాలను విక్రయించగా గత నెలలో 86,380 వాహనాలనే అమ్మగలిగింది. దేశీయ విక్రయాలు 1,52,608 నుంచి 54.9 శాతం క్షీణించి 68,815 వాహనాలకు పరిమితమయ్యాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్‌-ప్రెసో విక్రయాలు 27,246 వాహనాల నుంచి 45.18 శాతం క్షీణించి 14,936కు పరిమితమయ్యాయి. కాంపాక్ట్‌ విభాగంలో స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ల విక్రయాలు 84,213 నుంచి 75.19 శాతం క్షీణతతో 20,891కు చేరాయి. ద్విచక్ర వాహనాల్లో బజాజ్‌ ఆటో విక్రయాలు 16 శాతం, సుజుకీ మోటార్‌ అమ్మకాలు 5 శాతం మేర క్షీణించగా, టీవీఎస్‌ మోటార్‌ విక్రయాలు 6 శాతం పెరిగాయి.

ఇదీ చదవండి:

కార్ల కంపెనీలకు చిప్​ల కొరత- పండగ సీజన్ గడిచేదెలా?

ABOUT THE AUTHOR

...view details