తెలంగాణ

telangana

ETV Bharat / business

2022 ఏప్రిల్‌ వరకు చిప్‌ కష్టాలు: రెనో ఇండియా ఎండీ - చిప్​ల కొరత ఎప్పటివరకు?

ప్రపంచంలో చిప్‌సెట్‌లు తయారు చేసేది కొన్ని కంపెనీలే. కొవిడ్‌ పరిణామాల వల్ల డిజిటలీకరణ అనూహ్యంగా పెరిగినా, అందుకు తగ్గట్లు చిప్‌సెట్‌ల తయారీ ఒక్కసారిగా పెరిగే పరిస్థితి లేదు. దిగ్గజ కంపెనీల పెట్టుబడులు పెరుగుతున్నందున, క్రమంగా చిప్‌సెట్‌ల కొరత తీరే అవకాశం ఉందని రెనో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ ఈనాడు​తో చెప్పారు. ఈ ఏడాదిలో మాత్రం వాహన పరిశ్రమకు కష్టాలు తప్పవని తేల్చి చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ..

Chip shortage 2021
చిప్​ల కొరత

By

Published : Aug 19, 2021, 8:03 AM IST

దిగ్గజ కంపెనీల పెట్టుబడులు పెరుగుతున్నందున, క్రమంగా చిప్‌సెట్‌ల కొరత తీరే అవకాశం ఉందని రెనో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ ఈనాడు​తో చెప్పారు. ఆయన ఇంకేం అన్నారంటే..

కేటాయింపులు మారడంతోనే..

చిప్‌సెట్‌ల కొరత వాహన పరిశ్రమను బాగా ఇబ్బంది పెడుతోంది. గిరాకీ-సరఫరాల మధ్య అంతరాలే ఇందుకు కారణం. లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి ఐటీ పరిశ్రమతో పాటు మరికొన్ని రంగాల సాంకేతిక నిపుణులు కూడా 'ఇంటి నుంచి పని చేయడం' ప్రారంభించడంతో ఒక్కసారిగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లతో పాటు వైఫైకు అవసరమైన రౌటర్లకు దాదాపు అన్ని దేశాల్లో గిరాకీ పెరిగింది. పిల్లలకు పాఠ్యాంశాల బోధన కూడా ఆన్‌లైన్‌లో కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్‌ పరికరాలు బాగా కొన్నారు. కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమై, లాక్‌డౌన్‌ విధించినప్పుడు వాహన తయారీ రంగం కూడా స్తంభించింది. లాక్‌డౌన్‌ తొలగించినా, వాహనాలకు గిరాకీ వెంటనే రాదనే భావనతో కంపెనీలు తయారీ తగ్గించాయి. ఫలితంగా వాహన కంపెనీల నుంచి చిప్‌సెట్‌ సరఫరాలను డిజిటల్‌ పరికరాల తయారీ సంస్థలకు మళ్లాయి.

సాఫ్ట్‌వేర్‌లోనే మార్పులు..

చిప్‌లు/వేఫర్స్‌ అనేవి అంతా ఒకటే. దాని ప్రాసెసింగ్‌, అప్లికేషన్‌, అందులో నిక్షిప్తం చేసే సాఫ్ట్‌వేర్‌కు అనుగుణంగా వినియోగం మారుతుంది. ప్రపంచంలో బాష్‌, వెస్టియాన్‌, కాంటినెంటల్‌, హిటాచీ, డెల్‌ వంటి దిగ్గజాలు వాహన సంస్థలకు చిప్‌సెట్‌లున్న ఎలక్ట్రానిక్స్‌ ప్రధానంగా సరఫరా చేస్తున్నాయి. ఈ సంస్థలకు చిప్‌సెట్‌ల తయారీ సంస్థల నుంచి సరఫరాలు సరిగా లేవు. సెల్‌ఫోన్లు, బొమ్మలు, టెలివిజన్‌లు, కంప్యూటర్లు, వాహన తయారీ కంపెనీలన్నింటికీ దిగ్గజ కంపెనీల నుంచే సిలికాన్‌ చిప్‌సెట్‌లు సరఫరా అవుతుంటాయి. మోడల్‌, అప్లికేషన్‌, తయారీసంస్థకు అనుగుణంగా చిప్‌ డెఫినిషన్‌ మారుతుంటుంది. టెక్నాలజీ పరంగా కార్లలో మరింత అడ్వాన్స్‌గా వినియోగిస్తారు.

కార్ల డిజిటలీకరణ వల్ల..:

ప్రస్తుతం మధ్యశ్రేణి, హైఎండ్‌ కార్లలో చిప్‌సెట్‌ల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. కార్లలోని ఎయిర్‌బ్యాగ్‌లు, ఇంజిన్‌ కంట్రోల్‌ యూనిట్‌, ట్రాన్స్‌మిషన్‌ కంట్రోల్‌ యూనిట్‌, డిస్‌ప్లే, ఓడోమీటర్‌.. ఇలా అన్నింటికీ చిప్‌సెట్‌ కావాలి. ఇప్పటి కార్లలో మెకానికల్‌ అప్లికేషన్‌ కోసం చిప్‌సెట్‌ కావాలి. అద్దాలపై వర్షం పడటం ప్రారంభం కాగానే, వాతంటత అవే వైపర్స్‌ పనిచేసేలా చూసేందుకు సెన్సర్‌లు అమరుస్తున్నారు. ఇందులో చిప్‌సెట్‌లు కావాలి. ఇంజిన్‌, ఎగ్జాస్ట్‌లకూ సెన్సర్లు ఉంటున్నాయి. .ఈ ఏడాది (2021)లో చిప్‌సెట్‌ కష్టాలు తీరేది లేదు. కొవిడ్‌ మూడోదశ రాకూడదని ఆశిద్దాం. కేసుల ఉద్ధృతి పెరగకపోతే 2022 రెండో త్రైమాసికం నుంచి చిప్‌సెట్‌ల సరఫరా పెరగొచ్చు. ఒకవేళ కొవిడ్‌ మూడోదశ ప్రబలితే చిప్‌సెట్‌ కష్టాలు మరింత పెరుగుతాయి.

ఇదీ చదవండి:చిప్‌ల కొరత.. ఎప్పటికో నిశ్చింత?

ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

ABOUT THE AUTHOR

...view details