తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనా స్మార్ట్​ఫోన్ల సేల్స్​పై 'స్వదేశీ' దెబ్బ - చైానా కంపెనీలపై బాయ్​కాట్​ చైనా ప్రభావం

చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలపై బాయ్​కాట్​ చైనా, వోకల్​ ఫర్ లోకల్​ ప్రభావం తీవ్రంగా పడింది. భారత్​లో చైనా స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థల మార్కెట్ వాటా ఏప్రిల్​-జూన్​ మధ్య 81 శాతం నుంచి 72 శాతానికి పడిపోయినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.

smartphone sales in India
స్వదేశీ మంత్రంతో చైనా కంపెనీలు కుదేలు

By

Published : Jul 24, 2020, 6:07 PM IST

Updated : Jul 24, 2020, 6:19 PM IST

భారత్​లో చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్ల మార్కెట్ వాటా భారీగా తగ్గింది. లాక్​డౌన్ సహా బాయ్​కాట్ చైనా, వోకల్ ఫర్ లోకల్ సెంటిమెంట్​తో.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ స్మార్ట్​ ఫోన్​ మార్కెట్లో చైనా కంపెనీల వాటా 81 శాతం నుంచి 72 శాతానికి పడిపోయింది. కౌంటర్​పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం తెలిసింది. ఇదే సమయంలో దేశీయ స్మార్ట్​ఫోన్​ తయారీ కంపెనీలైన లావా, మైక్రోమ్యాక్స్​ల మార్కెట్ వాటాలు స్వల్పంగా పెరిగినట్లు వెల్లడైంది.

కంపెనీల వారీగా..

దేశీయ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ను ఏలుతున్న షియోమీ మార్కెట్ వాటా మార్చి త్రైమాసికంతో పోలిస్తే.. జూన్ త్రైమాసికంలో 30 శాతం నుంచి 29 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్​ మార్కెట్ వాటా మాత్రం 26 శాతానికి పెరగటం గమనార్హం. దీనితో దేశంలో రెండో దేశీయ స్మార్ట్​ఫోన్ మార్కెట్​లో శాంసంగ్ మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.

శాంసంగ్ తర్వాతి స్థానాల్లో వివో (17 శాతం), రియల్​మీ (11 శాతం), ఒప్పో (9 శాతం) ఉన్నాయి.

ప్రీమియం స్మార్ట్​ఫోన్ల సెగ్మెంట్​లో వన్​ప్లస్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

విక్రయాలు..

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో స్మార్ట్​ఫోన్ల విక్రయాలు 51 శాతం తగ్గి.. 18 మిలియన్ యూనిట్లకు పరిమితమైనట్లు కౌంటర్​పాయింట్​ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో 37.7 మిలియన్ల స్మార్ట్​ఫోన్లు విక్రయమవ్వడం గమనార్హం.

ఫీచర్​ ఫోన్ల విభాగం..

ఫీచర్​ ఫోన్ల విభాగంలో లావా 23 శాతం మార్కెట్ వాటాతో ప్రథమ స్థానంలో ఉంది. శాంసంగ్ (22 శాతం), నోకియా (9 శాతం), కార్బన్ (5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:చైనాకు భారత్​ మరో షాక్​- బిడ్డర్లపై ఆంక్షలు!

Last Updated : Jul 24, 2020, 6:19 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details