తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనా ఎఫ్​డీఐకి బ్రేక్​ వేసే వెబ్​సైట్​​ హ్యాక్​

సరిహద్దు ఉద్రిక్తతల మధ్య చైనా హ్యాకర్లు విజృంభిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంలోని వ్యాపార విభాగానికి చెందిన డీపీపీఐటీ వెబ్​సైట్​ను హ్యాక్​ చేశారు. ప్రభుత్వం ఈ డీపీపీఐటీని దేశంలోకి చైనా ఎఫ్​డీఐలను తగ్గించేందుకు ఉపయోగిస్తుండటం గమనార్హం.

Chinese hackers now target website of DPIIT that curtailed Chinese FDI
చైనా ఎఫ్​డీఐను నియంత్రించే డీపీఐఐటీ వెబ్​సైట్​ హ్యాక్​

By

Published : Jun 22, 2020, 7:36 PM IST

కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యాపార విభాగానికి చెందిన ఓ వెబ్​సైట్​ హ్యాకింగ్​కు గురైంది. భారత్​-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, దేశంలో చైనాపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ దాడి సర్వత్రా చర్చనీయాంశమైంది.

అయితే ఆర్థిక సేవల పేరిట సైబర్‌ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్'‌(సీఈఆర్‌టీ-ఇన్‌) ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం డిపీఐఐటీ(డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రొమొషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​) వెబ్​సైట్​ను కొందరు హ్యాక్​ చేశారు. చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను డీపీఐఐటీ నియంత్రిస్తుండటం గమనార్హం.

హ్యాకింగ్​కు గురైన అనంతరం వెబసైట్​ స్క్రీన్​ మీద 'మెడిటేషన్​' అనే అర్థం వచ్చేలా చైనా ఆక్షరాలు కనపడ్డాయి. అయితే సైట్​ను పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు.

ఈ పూర్తి వ్యవహారాన్ని డీపీఐఐటీ సీనియర్​ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే దీనిపై ఆ శాఖ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు.. పేరు చెప్పడం ఇష్టం లేని వాణిజ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి:-చైనా సంస్థల పెట్టుబడులపై 'మహా' ప్రభుత్వం స్టే

ABOUT THE AUTHOR

...view details