అతిపెద్ద ఇ కామర్స్ సంస్థ అలీబాబా, 2014లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన తరవాత తొలిసారిగా ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో నిర్వహణ నష్టాన్ని నమోదు చేసింది. బీజింగ్ 2.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21,000 కోట్లు) అపరాధ రుసుము విధించడంతోనే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఐపీఓ తరవాత తొలిసారి అలీబాబాకు నష్టాలు - తొలిసారి నష్టాలను చవిచూసిన అలీబాబా
చైనాకు చెందిన ఇ కామర్స్ సంస్థ అలీబాబా ఐపీఓకి వచ్చినప్పటి నుంచి తొలిసారిగా నష్టాన్ని నమోదు చేసింది. ఇటీవల నింబంధనలకు విరుద్ధంగా కంపెనీ వ్యవహరించిందన్న ఆరోపణలతో పెద్దమొత్తంలో అపరాధ రుసుము చెల్లించాల్సి వచ్చింది. దీంతో నష్టాల బారిన పడినట్లు తెలిపింది.
ఐపీఓ తరవాత తొలిసారి అలీబాబాకు నష్టాలు
మార్చి త్రైమాసికంలో గుత్తాధిపత్య వ్యతిరేక అపరాధ రుసుముగా 7.66 బిలియన్ యువాన్‌లను (1,170 మిలియన్ డాలర్లు-రూ.9,000 కోట్లు) కంపెనీ చెల్లించాల్సి వచ్చింది. ఆదాయం 64 శాతం వృద్ధి చెంది 187.4 బిలియన్ యువాన్‌లకు చేరింది. 2022 మార్చి నాటికి ఆదాయం 30 శాతం మేర పెరిగి 930 బిలియన్ యువాన్‌లకు చేరుకుంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే 81.1 కోట్ల క్రియాశీల వార్షిక వినియోగదార్లు ఉంటారని తెలిపింది.
ఇదీ చూడండి:మస్క్ యూటర్న్- బిట్‌కాయిన్ 17% పతనం!