Chief Economic Advisor: బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆర్థిక సలహాదారుగా(సీఈఏ) డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ నియామకమైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
డాక్టర్ నాగేశ్వరన్.. ఒక రచయిత, టీచర్, కన్సల్టెంట్ సహా క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజీగా, జూలియస్ బేర్ గ్రూప్ మాజీ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తించినట్లు పేర్కొంది ఆర్థిక శాఖ. ఆయన భారత్‌తో పాటు సింగపూర్‌లోని పలు బిజినెస్ స్కూల్స్, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో పనిచేసినట్లు తెలిపింది.
ప్రధాన ఆర్థిక సలహాదారులగా పని చేసిన కృష్ణమూర్తి సుబ్రమణియన్ పదవీకాలం గతేడాది డిసెంబరులోనే ముగిసింది. ఈ క్రమంలో.. 2021, అక్టోబర్ 9న తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాగేశ్వరన్ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు.