తెలంగాణ

telangana

ETV Bharat / business

ఓటీటీ, డిజిటల్​ మీడియా మాధ్యమాలు ఇవి పాటించాల్సిందే!

ఓటీటీ, డిజిటల్​ మీడియా మాధ్యమాలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఒకేతరహా న్యాయం వర్తింపజేయడానికి కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇకమీదట టీవీ, ప్రింట్, డిజిటల్, ఓటీటీ వేదికలన్నీ నిబంధనలను తప్పక అనుసరించాల్సిందేనన్నారు. ఓటీటీలు.. తాము ప్రసారం చేసే అంశాలను వయస్సుల వారీగా 5 వేర్వేరు కేటగిరీలుగా విభజించుకోవాలని సూచించింది.

Centre's guidelines for OTT  platforms
ఓటీటీ, డిజిటల్​ మీడియా మాధ్యమాలు ఇవి పాటించాల్సిందే!

By

Published : Feb 25, 2021, 8:36 PM IST

Updated : Feb 25, 2021, 11:24 PM IST

ఓటీటీ, డిజిటల్​ మీడియా మాధ్యమాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వీలుగా కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​ వీడియో సహా భారత్​లో సేవలు అందించే ఓటీటీలు.. తాము ప్రసారం చేసే అంశాలను వయసుల వారీగా 5 వేర్వేరు కేటగిరీలుగా విభజించుకోవాలని సూచించింది.

ఓటీటీ మార్గదర్శకాలు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​

ఫిర్యాదుల పరిష్కారానికి డిజిటల్​ మీడియా ప్రచురణకర్తలు మూడంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావ్‌డేకర్‌.

ఇక మీదట అన్ని వ్యవస్థలూ స్వీయనియంత్రణ పాటిస్తూనే, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు ఒకేతరహా న్యాయం వర్తింపజేయడానికి కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఇకమీదట టీవీ, ప్రింట్, డిజిటల్, ఓటీటీ వేదికలన్నీ నిబంధనలను తప్పక అనుసరించాల్సిందేనన్నారు.

స్వీయ నియంత్రణ తప్పనిసరి..

డిజిటల్‌ మీడియా పోర్టళ్లు అబద్ధాలు, వదంతులు ప్రచారం చేయడానికి వీల్లేదు కాబట్టి.. ప్రతి మీడియా సంస్థ స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్రం స్పష్టమైన నిబంధనలు తయారు చేసింది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్​పై పార్లమెంటులో 50 ప్రశ్నలు వచ్చాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని దిల్లీ, చెన్నైలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉద్యోగులతో విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపినట్లు జావడేకర్​ తెలిపారు. ఓటీటీలు స్వీయనియంత్రణ పాటించాలని కోరామని, వారు అందుకు సిద్ధం కాకపోవడంతో ప్రభుత్వం తరఫున వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని జావడేకర్​ స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా ఓటీటీ, డిజిటల్‌ మీడియాలు తమ వివరాలు వెల్లడించాలని, రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేయడం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ సంస్థల తరహాలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

మూడంచెల వ్యవస్థ..

ఓటీటీ, డిజిటల్​ మీడియా మాధ్యమాలు ఇవి పాటించాల్సిందే
ఓటీటీ, డిజిటల్​ మీడియా మాధ్యమాలు ఇవి పాటించాల్సిందే
ఓటీటీ, డిజిటల్​ మీడియా మాధ్యమాలు ఇవి పాటించాల్సిందే

తొలి దఫాలో భాగంగా ప్రతి సంస్థ భారత్‌లో అంతర్గత ఫిర్యాదుల పరిష్కార అధికారిని నియమించుకోవాలి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి 15 రోజుల్లోపు దాన్ని పరిష్కరించే బాధ్యత ఆ అధికారిదే.

రెండో అంచె కింద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అన్నీ స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రిటైర్డ్‌ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి లేదంటే స్వతంత్ర ప్రముఖ వ్యక్తుల నేతృత్వంలో ఆరుగురు సభ్యుల వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి. ఈ వ్యవస్థను సమాచార, ప్రసారశాఖ వద్ద నమోదు చేసుకోవాల్సిందేనన్న నిబంధన తప్పనిసరి.

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఓటీటీ సంస్థలు పాటిస్తున్నాయా? లేదా? అన్నది ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ సంస్థ 15 రోజుల్లో పరిష్కరించని ఫిర్యాదులను ఈ వ్యవస్థ పరిశీలించి.. ఫిర్యాదులను విచారించి తీర్పు వెలువరించినప్పుడు ఒకవేళ ప్రసారమాధ్యమ సంస్థది తప్పని తేలిదే అందుకు క్షమాపణలు కోరుతూ టీవీలో స్క్రోలింగ్‌ వేసినట్లుగా, ఓటీటీ సంస్థలూ చేయాలని నూతన నిబంధనలు రూపొందించారు.

వీటికి తోడు మరొక ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం కూడా ఏర్పాటవుతుందని.. స్వీయనియంత్రణ సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను ఇది వెల్లడిస్తుందని. ఫిర్యాదులపై విచారణ కోసం ఇది శాఖ పరమైన కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు.

ఇదీ చూడండి:ప్రతిధ్వని: ఓటీటీ వినోదమా..? విశృంఖలమా?

Last Updated : Feb 25, 2021, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details