పెట్రో ధరలు పెరిగి దేశ ప్రజలు అల్లాడుతున్న వేళ.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari News) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం త్వరలోనే 'ఫ్లెక్స్ ఇంజిన్ పాలసీ'ని(Flex Engine In India) తీసుకురానుందని తెలిపారు. ఇథనాల్(Ethanol Vehicles In India) ఆధారిత ఫెక్స్ ఇంజిన్ల వినియోగం ద్వారా పెట్రోల్ అవసరం తగ్గుతుందని చెప్పారు. తద్వారా.. ప్రజలకు ఇంధన ధరల బాధ నుంచి కాస్త విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
"ప్రపంచంలోని ఆటోమొబైల్ సంస్థలన్నీ.. పెట్రోల్ ఆధారిత వాహనాలనే ఉత్పిత్తి చేస్తున్నాయి. అవే మార్కెట్లలో దొరుకుతున్నాయి. అయితే.. బ్రెజిల్, కెనడా, అమెరికాలో డ్రైవర్లకు పెట్రోలే కాకుండా పలు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఆ దేశాల్లో వాహనదారులు.. పెట్రోల్ లేదా బయో ఇథనాల్‌ను కొట్టించుకోవచ్చు. అక్కడి కార్లు పెట్రోల్‌తో నడుస్తాయి. బయో ఇథనాల్‌తోనూ నడుస్తాయి. మన దేశంలో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.100కు పైగా ఉంది. అయితే... అదే సమయంలో ఇథనాల్ ధర రూ.65 మాత్రమే. భారత్‌లో రైతులు ఇథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చు. చెరకు రసం, మొలాసిస్, బియ్యం తదితరాలతో దాన్ని ఉత్పత్తి చేయవచ్చు."
-నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి.
భారత్ ప్రస్తుతం రూ.8 లక్షల కోట్లు విలువ చేసే ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని గడ్కరీ(Nitin Gadkari News) తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఇది రూ.25 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. కాబట్టి.. దిగుమతులపై ఆధార పడకుండా స్వయం సమృద్ధి దిశగా భారత్ మారాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇథనాల్ ధర రూ.65 మాత్రమే..
"పెట్రోల్ కంటే ఇథనాల్(Ethanol Vehicles In India) ఎన్నో రెట్లు ఉత్తమం. ఇథనాల్ వినియోగం(Ethanol Vehicles In India) ద్వారా కాలుష్యం తగ్గుతుంది. అందుకే మనకు ఫ్లెక్స్ ఇంజిన్ ఆప్షన్ ఉంది. ఈ ఇంజిన్ల ద్వారా పెట్రోల్ లేదా ఇథనాల్‌ను వినియోగించవచ్చు. దీనికోసం అదనంగా ఖర్చు చేయాల్సిన పనేమీ లేదు. ఒక ఫిల్టర్ మాత్రమే అవసరం అవుతుంది. మెటల్ వాషర్లకు బదులు రబ్బర్ వాషర్లను వినియోగించవచ్చు. ఈ సాంకేతికతను దేశంలోని ఎన్నో కంపెనీలు కూడా వినియోగిస్తున్నాయి. దేశంలో పెట్రోల్ ధర అధికంగా ఉంటే.. ప్రజలు ఇథనాల్‌ను(Ethanol Price) రూ.65కే పొందుతారు. ఒక్క లీటర్ ఇథనాల్ ద్వారా కనీసం రూ.25 ఆదా చేసుకోవచ్చు. కాలుష్యం తగ్గడం సహా రైతులకు కూడా కాస్త ఆదాయం చేకూరుతుంది. స్వయం సమృద్ధ దిశగా భారత్ అడుగులు వేయటంలో ఇదో పెద్ద ఘనత."
-నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి.
'భవిష్యత్ అంతా ఇథనాల్దే'