తెలంగాణ

telangana

ETV Bharat / business

'జీఎస్‌టీ పరిధిలోకి విమాన ఇంధనంపై మండలిదే తుది నిర్ణయం' - విమాన ఇంధనాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురానున్న కేంద్రం

Gst on aviation turbine fuel: విమాన ఇంధనాన్ని వస్తుసేవల పన్ను జీఎస్​టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని వచ్చే జీఎస్‌టీ మండలి సమావేశంలో ప్రభుత్వం చర్చకు తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పరిశ్రమ సంఘం అసోచామ్‌తో బడ్జెట్‌ అనంతరం చర్చలో ఆమె మాట్లాడారు. జీఎస్‌టీలోకి ఏటీఎఫ్‌ను తీసుకురావడంపై మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.

Gst on aviation turbine fuel:
Gst on aviation turbine fuel

By

Published : Feb 7, 2022, 7:33 AM IST

Gst on aviation turbine fuel: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్‌) తీసుకొచ్చే అంశాన్ని వచ్చే జీఎస్‌టీ మండలి సమావేశంలో ప్రభుత్వం చర్చకు తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పరిశ్రమ సంఘం అసోచామ్‌తో బడ్జెట్‌ అనంతరం చర్చలో ఆమె మాట్లాడారు. జీఎస్‌టీలోకి ఏటీఎఫ్‌ను తీసుకురావడంపై మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు. ఈ అంశంపై కేంద్రం ఒక్కటే నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్‌టీలోకి ఏటీఎఫ్‌ను తీసుకురావాలంటూ స్పైస్‌జెట్‌ అధిపతి అజయ్‌ సింగ్‌ అభ్యర్థించగా, నిర్మలా సీతారామన్‌ పైవిధంగా స్పందించారు. 'ముడిచమురు బ్యారెల్‌ 90 డాలర్లపైకి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 75 వద్ద ఉంది. ఫలితంగా ఏటీఎఫ్‌ ధర పెరిగి, పౌరవిమానయాన రంగం కుదేలవుతోంది. జీఎస్‌టీలోకి ఏటీఎఫ్‌ను తీసుకొస్తే కంపెనీలకు సాయపడినట్లవుతుంది' అని అజయ్‌ సింగ్‌ అన్నారు. కరోనా తర్వాత విమానయాన సంస్థల ఇబ్బందులు పెరిగాయని, బ్యాంకులతో మాట్లాడి చేయూత అందిస్తామని సీతారామన్‌ భరోసా ఇచ్చారు.

అంతర్జాతీయ పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధం

అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం సహా అంతర్జాతీయ పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని, ఆర్థిక వ్యవస్థను ఇబ్బందులు పాలవ్వకుండా చూస్తామని సీతారామన్‌ భరోసా ఇచ్చారు. పరిశ్రమ సంఘం ఫిక్కీతో చర్చల సందర్భంగా ఆమె మాట్లాడారు. 'ఆర్థిక వ్యవస్థలో రికవరీ కనిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగనుంది. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ పరిస్థితులు మారాయి. భారత్‌ ఈ అవకాశాన్ని వదులుకోకూడదు' అని మంత్రి వివరించారు.

ఇదీ చూడండి:డిజిటల్ రూపీకి, పేటీఎంకు తేడా ఏంటి? ఏది బెటర్?

ABOUT THE AUTHOR

...view details