ఆర్టికల్ 370 రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.... అక్టోబర్‌లో(దసరా సమయం) జమ్ముకశ్మీర్‌లో భారీ స్థాయిలో పెట్టుబడి సదస్సు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సదస్సుకు ప్రముఖ నాయకులంతా హాజరయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రాభివృద్ధి కోసం

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 వల్ల ఇన్నాళ్లూ కశ్మీరీయేతరులు ఆ ప్రాంతంలో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయలేకపోయేవారు. ఫలితంగా రాష్ట్రానికి ప్రైవేటు పెట్టుబడులు, పరిశ్రమలు రాక అభివృద్ధి కుంటుపడింది.
ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు వల్ల ఆ ప్రాంతంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రత్యేక హోదా తొలగింపు తమకు ప్రయోజనం చేకూరుస్తుందని కశ్మీరీ ప్రజలు అర్థం చేసుకుంటారనీ కేంద్రం ఆశిస్తోంది.
ఇదీ చూడండి: 'ఉగ్ర కుట్రల జోరు పెంచిన పాకిస్థాన్'