గత ఏడాది ఫిబ్రవరి 24న కేంద్రం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇప్పటి వరకు రూ.50,850 కోట్లను అందించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. పథకం ప్రారంభించి ఏడాది కావస్తున్న నేపథ్యంలో వివరాలు ప్రకటించింది వ్యవసాయ శాఖ. ఈ పథకం కింద 8.46 కోట్ల రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం అందించినట్లు తెలిపింది.
2018 డిసెంబర్ నుంచి వర్తించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. పెట్టుబడి సాయం కింద రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.6వేలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది.