కరోనా నేపథ్యంలో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్95 మాస్క్‌ల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆయా ఆంక్షలను ఎత్తివేసింది. ఎన్95, ఎఫ్ఎఫ్2 మాస్క్‌లను నిషేధిత జాబితా నుంచి తొలగించి, మిగితా మాస్క్‌ల మాదిరిగా స్వేచ్ఛగా ఎగుమతి చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు విదేశీ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎన్95 మాస్కుల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత - ఎన్95 మాస్కుల ఎగుమతి
ఎన్95 మాస్కుల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్రం తొలగించింది. ఇక నుంచి ఇతర మాస్కుల మాదిరిగా వాటిని స్వేచ్ఛగా ఎగుమతి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రపంచదేశాల కోసం భారత్ ఈ మాస్కులను తయారు చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

ఎన్95 మాస్కుల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
ప్రపంచ దేశాల కోసం భారత్ ఎన్95, ఎఫ్ఎఫ్2 మాస్క్‌లను తయారు చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచమంతటికీ ఇకనుంచి మాస్కులను స్వేచ్ఛగా ఎగుమతి చేసుకోవచ్చని ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి స్వాగతించింది.