తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ సంస్థలకు 4 నెలలు అద్దె నుంచి మినహాయింపు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో టెక్​ పార్కుల్లోని ఐటీ సంస్థలకు నాలుగు నెలలు అద్దె నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం. ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటన చేసింది.

Centre gives 4-month rental waiver to IT firms operating from software tech parks
ఆ సంస్థలకు నాలుగు నెలలు అద్దె నుంచి మినహాయింపు

By

Published : Apr 17, 2020, 1:21 PM IST

కరోనా లాక్​డౌన్​తో నష్టపోతున్న చిన్న సంస్థలకు అండగా నిలిచేందుకు కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి 1 నుంచి జూన్​ 30 వరకు ఎస్​టీపీటీ(సాఫ్ట్​వేర్​ టెక్నాలజీ పార్స్క్​ ఆఫ్​ ఇండియా) పరిధిలో ఉన్న ఐటీ సంస్థలకు 4 నెలల పాటు అద్దె నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

చాలా సంస్థలకు ఉపయోగం

"టెక్ పార్కుల్లో ఉన్నవాటిలో అత్యధికం చిన్న, మధ్య తరహా సంస్థలు లేదా అంకుర సంస్థలే. అద్దె మినహాయింపు నిర్ణయంతో 60 టెక్ పార్కుల్లోని 200 ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు లబ్ధి చేకూరనుంది. పరోక్షంగా ఆయా సంస్థల్లో పనిచేసే 3 వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఈ అద్దె మినహాయింపు మొత్తం విలువ రూ.5కోట్లు" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:కరోనా చీకట్ల నడుమ ఆర్​బీఐ ఉద్దీపన దీపం

ABOUT THE AUTHOR

...view details