జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అక్టోబర్, నవంబర్ నెలలకు గాను రూ.19,950 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు విడుదల చేసిన పరిహారం మొత్తం రూ. 1,20,498 కోట్లకు చేరినట్లు పేర్కొంది.
జనవరి 31 లోపు రూ.78,874 కోట్లు సెస్ కింద వసూలు అయినట్లు కేంద్రం తెలిపింది. జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటు భర్తీకి ఐదేళ్లపాటు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వాలని జీఎస్టీ చట్టం చెబుతోంది. ఇందులో భాగంగా కేంద్రం తాజాగా జీఎస్టీ పరిహారం ఇచ్చింది. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది.