దేశంలో ఇకపై భారతీయ ప్రమాణాలు(బీఐఎస్) కలిగిన హెల్మెట్లనే తయారు చేయాలని, వాటినే వాడాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. "హెల్మెట్ ఫర్ రైడర్స్ ఆఫ్ టూ వీలర్స్ మోటార్ వెహికిల్స్ ఆర్డర్, 2020 " అనే పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది.
రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. భారతీయ శీతోష్ణస్థితికి అనుకూలంగా బరువు తక్కువగా ఉన్న హెల్మెట్లను వాడాలని కమిటీ 2018లో సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏటా దేశంలో దాదాపు 1.7కోట్ల ద్విచక్ర వాహనాలు తయారు అవుతున్నాయి.